బిగ్‌బాస్‌ బిగించాడుగా..

బిగ్‌బాస్‌ బిగించాడుగా..
x
Highlights

ఒకే ఇంట్లో వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు.. చుట్టూ కెమెరాలు.. ఒక్క బిగ్‌బాస్‌ వాయిస్ తప్ప మరేమీ వినబడే అవకాశంలేని పరిస్థితి. కొత్త కొత్తగా...

ఒకే ఇంట్లో వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు.. చుట్టూ కెమెరాలు.. ఒక్క బిగ్‌బాస్‌ వాయిస్ తప్ప మరేమీ వినబడే అవకాశంలేని పరిస్థితి. కొత్త కొత్తగా మొదలైన ఆట. మొదటిరోజు.. ఆ ఇంట్లో ఉన్నవారికి ఎలా ఉందో కానీ, టీవీల ముందు కుర్చున్నవారికి మంచి వినోదం అందింది. మొదటిరోజే బిగ్‌బాస్‌ ఇంట్లోవారికి చుక్కలు చూపించాడు.

మొదటిరోజు..

సందడిగా నాగార్జున 15 మందిని బిగ్‌బాస్‌ హౌస్ లోకి పంపించి వెళ్ళిపోయాడు. హౌస్ లోకి అడుగు పెట్టగానే బిగ్‌బాస్‌ రవికృష్ణ, శివజ్యోతి,అన్షు రెడ్డి లకు టాస్క్ ఇచ్చాడు. వారి తరువాత వచ్చిన వారందరికీ కొన్ని ప్రశ్నలు వేసి జవాబు రాబట్టడం ఆ టాస్క్. అది ఎందుకో అర్థం కాని వారందరికీ, మొదటి రోజే షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఆ ప్రశ్నలకు జవాబులు పరిశీలించి మిగిలిన పన్నెండు మందిలోనూ ఆరుగురిని ఎంపిక చేయాలి ఆ ముగ్గురూ. ఇక వీరు రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, శ్రీముఖి, బాబా భాస్కర్‌, జాఫర్‌లను ఎంపిక చేసుకుని విషయం బిగ్‌బాస్‌ కి చెప్పారు. వీరందరూ నామినేట్ లో ఉన్నారని పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అయితే నామినేట్ చేసింది ఎందుకో తెలీక సభ్యులంతా అయోమయంలో ఉన్న సమయంలో.. నామినేషన్‌ ప్రక్రియలో ఉన్న ఆరుగురికీ, అందులోంచి తప్పించుకునే అవకాశాన్ని కల్పించాడు బిగ్‌బాస్‌. ఇక్కడ పెట్టాడు అసలైన ఫిట్టింగ్.. వారు ఒక మానిటర్ ను ఎంచుకోవాలని చెప్పాడు. వీరంతా హేమను తమ మానిటర్ గా ఎంచుకున్నారు. ఆమె వీళ్లు నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు సహకరిస్తుందని బిగ్‌బాస్‌ చెప్పాడు.

నామినేట్‌ అయిన ఒక సభ్యుడు మిగిలిన ఇంటిసభ్యుల్లోంచి ఒకరిని తనకు బదులుగా.. సరైన కారణాలను చెప్పి రీప్లేస్‌ చేయవచ్చునని బిగ్‌బాస్‌ తెలిపాడు. అయితే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం మానిటర్‌దేనని బిగ్‌బాస్‌ పేర్కొన్నాడు. ఐదుసార్లు ఓ బెల్‌ మోగుతుందని.. మోగిన ప్రతిసారి ఆరుగురిల్లోంచి ఒకరు.. మిగిలిన హౌస్‌మేట్స్‌లోంచి ఒకర్ని ఎన్నుకుని సరైన కారణాలు చెప్పి నామినేట్‌ చేయవచ్చని తెలిపాడు. అవతలి వ్యక్తి కూడా తాను చెప్పదలుచుకున్నది తెలియజేయవచ్చని బిగ్‌బాస్‌ సూచించాడు. అయితే తుది నిర్ణయం మాత్రం మానేటర్‌గా ఎంపికైన హేమదేనని స్పష్టం చేశాడు. ఇదీ మొదటిరోజు కథ.

మొదటిరోజు ఎలా ఉందంటే..

చాలా సరదాగా ప్రారంభమైన మొదటిరోజు.. టెన్షన్ తో ఆగింది.. జాఫర్ పొట్ట తగ్గించుకోవడానికి బాబా భాస్కర్ వ్యాయామాలు నేర్పించటం ఫన్నీగా ఉంది. ఇక శ్రీముఖి తనదైన పటాస్ స్టైల్ లో కేకలతో సందడి చేసింది. ఇక బిగ్‌బాస్‌ టాస్క్ లతో మొదటిరోజే మెల్లగా గ్రూపులు కట్టడం మొదలైంది. దాదాపుగా మూడు గ్రూపులు తయారైనట్టు కనిపించింది. మొదట హౌస్ లోకి వెళ్ళిన ముగ్గురూ ఒక గ్రూప్.. వాళ్లు నామినేట్ చేసిన ఆరుగురు ఒక గ్రూప్, మిగిలిన ఆరుగురు ఒక గ్రూప్. అసలు బిగ్‌బాస్‌ ఆటే అది కదా. విడగొట్టి పడగొట్టటం.. అందులో వినోదాన్ని పంచడం. కాకపొతే, మొదటి రెండు సీజన్లలో కొంచెం హౌస్ మేట్స్ సెటిల్ అయ్యేదాకా ఆగి ఆడించేవాడు. ఇప్పుడు లోపలి వెళ్ళటం తోనే మొదలెట్టేశాడు. అంతే. ఈ ఎపిసోడ్ మొత్తంలో చెప్పుకోవాల్సింది హేమ, బాబా భాస్కర్ గురించి. బాబా భాస్కర్ ఫన్నీగా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక హేమ మొదటిరోజే దొరికిపోయింది. ఇప్పుడు హౌస్ లో మంగళవారం జరిగే సన్నివేశాలన్నీ హేమ చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. మరి బయట ప్రపంచంలో రాజకీయాల్లో దూసుకుపోతున్న హేమ ఈ పద్నాలుగు మంది మధ్య జరిగే రాజకీయంలో న్యాయనిర్ణేతగా ఎలా నెగ్గుకువస్తుందో ఆసక్తికరంగానే ఉంది. ఈరోజు ఏం జరుగుతుందో మరి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories